ఇళయదళపతి తో మూవీ పై వెట్రిమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇళయదళపతి తో మూవీ పై వెట్రిమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Apr 24, 2024 3:00 AM IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన వెట్రిమారన్ ప్రస్తుతం విడుదలై పార్ట్ 2 యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. అయితే కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇళయదళపతి విజయ్ తో వెట్రిమారన్ ఒక మూవీ చేయనున్నారు అనే వార్త కొన్నాళ్లుగా మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా ఆ వార్త పై తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా వెట్రిమారన్ మాట్లాడుతూ, నిజానికి తన వద్ద ఆయనతో చేయబోయే ప్రాజక్ట్ యొక్క స్టోరీ సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే అది పట్టాలెక్కే అవకాశం లేదని అన్నారు.

ప్రస్తుతం వెంకట్ ప్రభు తీస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ చేస్తున్న ఇళయదళపతి విజయ్, దాని అనంతరం డివివి దానయ్య నిర్మాణంలో ఒక మూవీకి కమిట్ అయినట్లు టాక్. ఇక ఇప్పటికే రాజకీయాల పై గట్టిగా ఫోకస్ పెట్టిన విజయ్ ఇకపై సినిమాలకు దాదాపుగా గుడ్ బై చెప్పినట్లే అని తెలుస్తోంది. మొత్తంగా దీనిని బట్టి విజయ్, వెట్రిమారన్ ల కాంబో మూవీ లేనట్లే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు