వెట్టై పంపిణీ హక్కులు దక్కించుకున్న బెల్లంకొండ

వెట్టై పంపిణీ హక్కులు దక్కించుకున్న బెల్లంకొండ

Published on Jan 17, 2012 5:49 PM IST


బెల్లంకొండ సురేష్ ఈ రోజుల్లో ఏది పట్టుకున్న బంగారం అయిపోతుంది. ఆయనకు 2011 సంవత్సరం బాగా కలిసి రాగా 2012 లో ‘బాడీగార్డ్’ మంచి ఒప్నేనింగ్ లభించింది. తాజాగా ఆయన ‘వెట్టై’ అనే తమిళ చిత్ర తెలుగు పంపిణీ హక్కులు దక్కించుకున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2.90 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉన్నట్లు సమాచారం. లింగుస్వామి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఆర్య, మాధవన్, సమీర రెడ్డి మరియు అమలా పాల్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తమిళ్లో సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు