మరో ఇద్దరి స్టార్ లకు కరోనా పాజిటివ్ !

మరో ఇద్దరి స్టార్ లకు కరోనా పాజిటివ్ !

Published on Apr 5, 2021 5:27 PM IST

కరోనా వైరస్ ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్ పెద్ద సమస్య అయిపోయింది. పైగా స్టార్స్ కు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో మేకర్స్ కి ఏం చేయాలో అర్ధం కావడంలేదు. మళ్ళీ షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాల్సిందేనా అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఆలియా భట్ కి, రణ్ బీర్ కపూర్ కి, మలైకాకి రీసెంట్ గా నివేతా థామస్ కి కరోనా పాజిటివ్ వచ్చింది.

అలాగే నిన్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా మరో ఇద్దరి బాలీవుడ్ స్టార్ లకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రముఖ హిందీ నటులు విక్కీ కౌషల్ మరియు భూమి పెడ్నేకర్ కు కోవిడ్ -19 పాజిటివ్ అని వాళ్లే అధికారికంగా తెలిపారు. ఇప్పుడు వీరితో సన్నిహితంగా ఉన్న మిగిలిన నటీనటులు కూడా తమ షూటింగ్స్ ను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా బాలీవుడ్ లో వరుసగా కేసులు వస్తుండంతో.. మిగిలిన మేకర్స్ లో ఆందోళన మొదలైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు