బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె భర్త, నటుడు విక్కీ కౌశల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక అందమైన ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలో, వీరిద్దరూ ఇంట్లోనే చాలా నిరాడంబరంగా, ఆత్మీయంగా బర్త్‌డే వేడుకలను జరుపుకున్నారు.
బ్యాక్‌గ్రౌండ్‌లో “హ్యాపీ బర్త్‌డే కత్రినా” అనే బ్యానర్ కనిపించగా.. కత్రినాను విక్కీ ప్రేమగా హగ్ చేసుకుని, ఒక చేత్తో కేక్ పట్టుకుని ఉన్న క్యూట్ మూమెంట్‌ను ఈ పిక్చర్‌లో చూడవచ్చు. వైట్ టాప్, డెనిమ్ జాకెట్ ధరించి సాధారణ లుక్‌లో ఉన్న కత్రినా.. భర్త కౌగిలిలో ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించింది. ఈ అందమైన చిత్రానికి విక్కీ కౌశల్ హిందీలో “జాన్ కా జన్మదిన్” అంటూ తన ప్రేమను కురిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కత్రినాకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


