‘దొంగ’ గా ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఖైదీ..!

‘దొంగ’ గా ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఖైదీ..!

Published on Dec 2, 2019 6:59 AM IST

donga

కార్తీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదల చేస్తూ, ఫుల్ జోష్ మీదున్నారు. ఇక తాజాగా ఆయన ఖైదీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. విడుదలైన తెలుగు మరియు తమిళ భాషలలో ఖైదీ మూవీ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. తమిళంలో వంద కోట్లు సాధించిన కార్తీ సినిమాగా ఖైదీ నిలిచింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం కామెడీ, సాంగ్స్, హీరోయిన్ వంటి కమర్షియల్ అంశాలు ఏమి లేకున్నా, ఇంతటి ఆదరణ దక్కించుకోవడం గమనార్హం.

ఇక కార్తీ లేటెస్ట్ మూవీ దొంగ మూవీ కూడా విడుదలకు సిద్ధమైంది. ఈనెల చివరి వారంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ చిత్రం తంబీ ని తెలుగులో దొంగ గా విడుదల చేస్తున్నారు. కార్తీ వదిన గారైన జ్యోతిక ఈ మూవీలో ఆయనకు అక్కగా నటించడం విశేషం. ఇక నేడు ఈ మూవీలోని రూపీ… రూపీ సాంగ్ విడుదల చేశారు. కార్తీ గోవాలోని బీచ్ లలో అమ్మాయిలతో, క్యాసినో లలో జూదంతో విచ్చల విడిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అటు దొంగ గా, అక్కకు కాపాడే మంచి తమ్ముడిగా రెండు పాత్రలలో వైవిధ్యంగా కనిపించనున్నారు. జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు