వైరల్ అవుతున్న విద్యాబాలన్ ఇంట్రస్టింగ్ ఫోటో !

నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్’లో.. ఎన్టీఆర్ గారి సతీమణి బసవతారకంగారి పాత్రను విద్యాబాలన్ పోషిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, బసవతారకంగారి గెటప్ లో ఉన్న విద్యా బాలన్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తెలుగింటి ఆడపడుచులా నిండు చీర కట్టులో సాంప్రదాయికంగా కనిపిస్తోన్న విద్యాబాలన్ ఫోటోను నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇక ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ లో విద్యాబాలన్ చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్యంగా బసవతారకంగారి చివరి రోజుల్లోని సంఘటనల సంబంధించిన సన్నివేశాల్లో చాలా ఎమోషనల్ ఉంటాయట.. ఆ సన్నివేశాల్లో విద్యాబాలన్ అద్భుతంగా నటించిందని.. బసవతారకంగారి పాత్రకు విద్యాబాలన్ తన నటనతో నిండుదనం తెస్తుందని చిత్రబృందం చెబుతుంది. కాగా విద్యాబాలన్ కు మాత్రం తెలుగులో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం.

ఇక కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, ఆ తర్వాత జనవరి 24న రెండో పార్ట్ అయిన ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version