ఓటీటీ రివ్యూ : విద్య వాసుల అహం – ఆహాలో ప్రసారం

ఓటీటీ రివ్యూ : విద్య వాసుల అహం – ఆహాలో ప్రసారం

Published on May 17, 2024 3:01 AM IST
Vidya Vasula Aham Movie Review in Telugu

విడుదల తేదీ : మే 17, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు

దర్శకుడు: మణికాంత్ గెల్లి

నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట

సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్

సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి

ఎడిటింగ్: సత్య గిడుతూరి

సంబంధిత లింక్స్: ట్రైలర్

రాహుల్ విజయ్ – శివాని రాజశేఖర్ జంటగా నటించిన విద్యా వాసుల అహం ఈ రోజు నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైంది. మరి ఈ వెబ్ ఫిల్మ్ మీకు నచ్చుతుందా ? లేదా ? అనేది మా సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

వైజాగ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. విద్య (శివానీ రాజశేఖర్) అనే కాన్ఫిడెంట్ అమ్మాయి, తన భాగస్వామి కోసం ఉన్నత ప్రమాణాలను పెట్టుకుని వెతుకుతుంది. తన పరీక్షల్లో నెగ్గిన వరుడినే పెళ్లి చేసుకుంటాను అని ఆమె తన తల్లిదండ్రులను కూడా ఒప్పిస్తోంది. ఈ క్రమంలో వాసు (రాహుల్ విజయ్) ఆమె జీవితంలోకి వస్తాడు. అతను మెకానికల్ ఇంజనీర్. విద్య – వాసు సంతోషంగా వివాహం చేసుకుంటారు. అయితే, సమయం గడిచేకొద్దీ, వారి అహంభావాలు వారి మధ్య సంబంధాన్ని, బంధాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్లు:

రాహుల్ విజయ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కొన్ని సన్నివేశాల్లో తన పాత్రకు తగ్గట్టుగా ఫుల్ ఎనర్జీని ప్రదర్శించాడు. అలాగే మంచి కామెడీ టైమింగ్‌ తో రాహుల్ విజయ్ బాగానే అలరించాడు. ఇక గ్లామర్ టచ్‌తో సంతృప్తికరమైన నటనను కనబరుస్తూ శివాని రాజశేఖర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఆమె పాత్ర చిత్రీకరణ కూడా బాగుంది.

మొత్తానికి ఈ యువ జంట తమ పాత్రలకు సరిగ్గా సరిపోయారు. ఇక కొన్ని సన్నివేశాలు కూడా సినిమాపై ఆకర్షణను పెంచుతాయి. అదనంగా, కొన్ని చోట్ల సంగీతం కూడా బాగా కుదిరింది. అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అలాగే , రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్లు:

పై కథాంశాన్ని చదివిన తర్వాత మరియు ఆన్‌లైన్‌లో ట్రైలర్‌ను చూసిన తర్వాత, ఈ చిత్ర కథాంశంతో పాటు స్క్రీన్ ప్లే కూడా ఊహించిన విధంగానే సాగుతుంది. అదే సరళమైన కథనాన్ని జోడించి, హీరో హీరోయిన్ల మధ్య ఇంకా బలమైన సన్నివేశాలను పెట్టి, ఆకట్టుకునే సంభాషణలను చొప్పించి ఉండి ఉంటే.. ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. కానీ దర్శకుడు ఈ సినిమాను ఆ విధంగా ఎలివేట్ చేయలేకపోయాడు.

మరోవైపు, రాహుల్ విజయ్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, అతను హైపర్యాక్టివ్‌గా మరియు కృత్రిమంగా నటించిన, కనిపించిన సందర్భాలు కూడా ఎక్కువే ఉన్నాయి. దురదృష్టవశాత్తు, సహాయక తారాగణం కూడా పరిమిత స్క్రీన్ స్పేస్ కే పరిమితం అయ్యింది. దీంతో, వారి నటనా ప్రదర్శనలు కూడా కథకు ప్లస్ అవ్వలేకపోయాయి.

మొత్తానికి, ప్రధాన పాత్రల మధ్య నెలకొన్న అహం, ఆ అహం కారణంగా వారి జీవితాల్లో జరిగిన సంఘటనలను దర్శకుడు సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు. పైగా క్లుప్తమైన రన్‌టైమ్ ఉన్నప్పటికీ, స్లోగా ఉన్న స్క్రీన్‌ప్లే మరియు పేలవంగా వ్రాసిన డైలాగ్‌ల కారణంగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.

సాంకేతిక విభాగం:

దర్శకుడు మణికాంత్ గెల్లి మంచి పాయింట్ ను మరియు ప్రతిభావంతులైన లీడ్ పెయిర్‌ని ఎంచుకున్నాడు కానీ, మరింత ఆకర్షణీయమైన స్క్రీన్‌ప్లే ను మాత్రం రాసుకోలేకపోయాడు. ఇక కల్యాణి మాలిక్ సంగీతం బాగానే ఉంది. కానీ గుర్తుండిపోయేలా ఆయన సంగీతం మాత్రం లేదు. కొన్ని సన్నివేశాలను ఇంకా బెటర్ గా సత్య గిడుతూరి ఎడిట్ చేసి ఉండవచ్చు. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫీ మరియు నిర్మాణ విలువలు సంతృప్తికరంగా ఉన్నాయి.

తీర్పు:

మొత్తమ్మీద, ఈ చిత్రంలోని ప్రధాన నటీనటులు అలరించినా.., ఈ విద్య వాసుల అహం చిత్రం మాత్రం నిరాశపరిచింది. పేలవమైన కథ మరియు కథనం సినిమా స్థాయిని తగ్గించాయి. దీనికితోడు, అనవసరమైన సన్నివేశాలు, బలహీనమైన ట్రీట్మెంట్ మరియు పస లేని డైలాగ్‌లు సినిమా ఫలితాన్ని బాగా దెబ్బతీశాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు