పాపం… విద్యాబాలన్ ను ఏడ్పించేసారుగా…!

Published on May 30, 2019 5:04 pm IST

బాలయ్య చేసిన “ఎన్టీఆర్” బయోపిక్ రెండు భాగాలలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు నటి విద్యాబాలన్. సమాజంలో లావుగా, పొట్టిగా ఉండే వారి పట్ల చాలా మంది చులకన భావన కలిగి వుంటారు. అలా ఉన్నవారికి సమాజంలో చాలా సార్లు అవమానాలు ఎదుర్కొని ఉంటారు.

బాడీ షేమింగ్‌ ని ఎదుర్కొన్న వాళ్ళల్లో సామాన్యులే కాదు, సెలెబ్రెటీలు కూడా వున్నారు. . వారిలో బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ ఒకరు. లావుగా ఉన్నందుకు తన దేహాన్ని తానే అసహ్యించుకునేదాన్నని ఎన్నోసార్లు ఆమె వెల్లడించారు. ఇలాంటి అవమానాలు ఎదుర్కొనేవారికి సాయం చేసేందుకు, ఇతరుల్లో స్ఫూర్తి నింపేందుకు విద్య.. ప్రముఖ రేడియో స్టేషన్‌ బిగ్‌ ఎఫ్‌ఎంతో కలిసి ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.

ఈ కార్యక్రమం పేరు ‘ధున్‌ బదల్‌ కే దేఖో’. ఈ నేపథ్యంలో బిగ్‌ ఎఫ్‌ఎం విద్యతో ఓ వీడియోను రూపొందించింది. ఆ వీడియోలో ఇతరుల శరీరాకృతిని, రూపును చూసి వెక్కిరించొద్దని పాట పాడుతూ విద్య కన్నీరుపెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. జీవితంలో బాడీ షేమింగ్‌ సంఘటనలు ఎదుర్కొన్న యువతీయువకులు ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం ఉంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More