సర్కార్ తో విజయ్ రేర్ ఫీట్ !

సర్కార్ తో విజయ్ రేర్ ఫీట్ !

Published on Nov 10, 2018 12:18 PM IST


ఇటీవల విడుదలైన సర్కార్ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్న కలక్షన్ల పరంగా తమిళ్లో కొత్త రికార్డులను సృష్టిస్తుంది. దేశ వ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే 97కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. విజయ్ ఈచిత్రం తో మూడో సారి 150కోట్ల క్లబ్ చేరిపోయాడు. ఇంతకుముందు ఆయన నటించిన ‘తేరి ,మెర్సల్’ చిత్రాలు ఈ ఫీట్ సాధించాయి.

ఇక ‘సర్కార్’ ఫై తమిళ నాడులోని అధికార పార్టీ అన్నా డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈచిత్రంలోని కొన్ని సన్నివేశాలు తొలిగించాలని డిమాండ్ చేస్తుంది. దాంట్లో మొదటగా వరలక్ష్మి శరత్ కుమార్ పోషించిన కోమల వల్లి పాత్ర. ‘జయలలిత’ బర్త్ నేమ్ ని ఆ పాత్రకు పెట్టాడని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా సినిమాలో మురుగదాస్ అతిధి పాత్ర ఫై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కోమల వల్లి పేరును మ్యూట్ చేయించి అభ్యంతర సన్నివేశాలను ఎడిట్ చేయాలని సెన్సార్ బోర్డు ను కోరింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు