మళ్ళీ వైవిధ్యంగా రాబోతున్న ‘బిచ్చగాడు’ హీరో !
Published on Aug 1, 2018 3:57 pm IST

విజయ్ ఆంటోనీ మంచి సంగీత దర్శకుడుతో పాటు అంతకు మించి మంచి నటుడు కూడా. ఎప్పుడూ వాస్తవిక పాత్రల్లో మరియు వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని కోరుకునే విజయ్ ఆంటోనీ అలాంటి చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కాగా విజయ్ గత చిత్రం ‘కాళీ’ పరాజయం అయినప్పటికీ ప్రస్తుతం రోషగాడు చిత్రంతో విజయ్ ఆంటోనీ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధం అవుతున్నాడు.

ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ సరసన నివేతా పెతూరాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తనే నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వయంగా విజయ్ ఆంటోనీనే సంగీతం ఆడిస్తుండటం విశేషం. ఈ సినిమాలో దీనా కీలక పాత్ర పోషిస్తుంది, మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook