క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోనీ “కిల్లర్” ట్రైలర్

Published on May 21, 2019 4:54 pm IST

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని యాక్షన్ హీరో అర్జున్ తో కలిసి నటిస్తున్న మూవీ ‘కొలైగారన్’. ఈ మూవీని ‘కిల్లర్‌’ అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు. కాగా ఈరోజు విడుదలైన మూవీ ట్రైలర్ చూస్తుంటే విజయ్ ఖచ్చితంగా ఈ సారి విజయాన్ని అందుకుంటాడనిపిస్తుంది. తను ప్రేమించిన అమ్మాయి చావుకు కారణమైన వారిపై పగతీర్చుకొనే ఒక తెలివైన సీరియల్ కిల్లర్ గా విజయ పాత్ర ఉంటుందని,ట్రైలర్ చుస్తే అర్థం అవుతుంది.
ఈ సీరియల్ మర్డర్స్ కేసు ని ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసుర్లుగా అర్జున్, నాజర్ చేస్తున్నారు.

ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ..కథ ఎంతో ఆసక్తిగా ఉన్నందువల్లే ఈ సినిమా ని తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాం.. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లర్ అంశాలు అన్ని ఇందులో ఉన్నాయి.. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. అర్జున్ నటన సినిమాకే హైలైట్..అన్నారు.. సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు అన్నారు.

ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా జూన్ 5న సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా హీరోయిన్. దియా మూవీస్‌ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా మర్డర్‌ మిస్టరీ, క్రైమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More