‘తుఫాన్’ టీజ‌ర్.. విజ‌య్ ఆంటోనీ అద‌ర‌గొట్టాడుగా!

‘తుఫాన్’ టీజ‌ర్.. విజ‌య్ ఆంటోనీ అద‌ర‌గొట్టాడుగా!

Published on May 29, 2024 8:00 PM IST

త‌మిళ హీరో విజ‌య్ ఆంటోనీ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తుఫాన్’ అతి త్వ‌రలో రిలీజ్ కు రెడీ అయ్యింది.ఈ సినిమాను విజ‌య్ మిల్ట‌న్ డైరెక్ట్ చేస్తుండ‌గా, ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక తాజాగా ఈ సినిమా టీజ‌ర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో ప్రేక్ష‌కులు ఇంప్రెస్ అవుతున్నారు.

ఇక తుఫాన్ టీజ‌ర్ ను చూస్తుంటే ఈ సినిమా ఓ క్రైమ్ అండ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. క‌నిపించ‌కుండా ఉంటూ త‌న‌కు కావాల్సిన వారిని కంటికిరెప్ప‌లా కాపాడుకునే పాత్ర‌లో విజ‌య్ ఆంటోనీ క‌నిపిస్తున్నాడు. భారీ యాక్ష‌న్ సీన్స్, ఛేజింగ్ ల‌తో ఈ సినిమాలో కావాల్సినంత యాక్ష‌న్ స్ట‌ఫ్ ఉండబోతున్న‌ట్లు టీజ‌ర్ లో క్లూ ఇచ్చారు. అటు హీరో, విల‌న్ ల పాత్ర‌ల‌ను కూడా అల్ట్రా స్టైలిష్ గా తీర్చిదిద్దినట్లు క‌నిపిస్తోంది.

తుఫాన్ మూవీలో విజ‌య్ ఆంటోనీతో పాటు స‌త్య‌రాజ్, శ‌ర‌త్ కుమార్, మేఘ ఆకాష్, డాలి ధ‌నంజ‌య‌, ముర‌ళీ శ‌ర్మ‌, శ‌ర‌ణ్య పొన్వ‌న‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాను అతి త్వ‌ర‌లో రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు. మ‌రి ఈ ఇంట్రెస్టింగ్ టీజ‌ర్ ను మీరూ చూసేయండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు