
తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం కొలైగరన్. ఈ సినిమా షూటింగ్ రేపటి నుండి ప్రారంభం కానుంది. యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కొద్దీ సేపటి క్రితం విడుదల చేశారు. ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ప్రదీప్ నిర్మిస్తున్నారు.
విజయ్ ఆంటోనీ ఇటీవల కాళీ చిత్రం తో ప్రేక్షకులముందుకు వచ్చారు.ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేక పోయింది. ఈ చిత్రం కాశీ పేరుతో తెలుగులోను రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా పరాజయం పొందింది.

