దేవరకొండ కొత్త చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్…!

Published on Sep 16, 2019 5:25 pm IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుసగా చిత్రాలు ప్రకటిస్తూ మంచి జోష్ లో ఉన్నారు. ఇటీవలే డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన ,ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న ఈ చిత్ర టైటిల్ పై ప్రకటన చేశారు చిత్ర బృందం.

రేపు ఉదయం 11గంటలకు విజయ్ దేవరకొండ చిత్ర టైటిల్ ప్రకటించనున్నారు. ఈమేరకు కొద్దిసేపటి క్రితం అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. విజయ్ కి జోడిగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా నటిస్తుండగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More