సాధారణంగా బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాలు పోటీ పడితే ఆ పోటీలో ఏ సినిమా గెలుస్తుందా.. అని అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. ఇక స్టార్ హీరోలు పోటీ పడితే, తమ హీరో సినిమా గెలవాలంటే తమ హీరో సినిమా హిట్ అవ్వాలని ఫ్యాన్స్ వార్‌కు దిగుతారు. ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర రెండు క్రేజీ సినిమాలు రిలీజ్ అయితే, ఇక అప్పటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
2026 డిసెంబర్‌లో ఇలాంటి సీన్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మనకు కనిపించబోతుంది. న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’తో బిజీగా ఉన్నాడు. ఇక ‘ఓజి’ బ్లాక్‌బస్టర్‌తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు సుజిత్. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే బ్లడీ రోమియో చిత్రం ఏప్రిల్ 2026లో షూటింగ్ ప్రారంభించుకుని డిసెంబర్ నాటికి రిలీజ్‌కు రెడీగా ఉంటుంది.
అటు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రౌడీ జనార్థన’ కేవలం టైటిల్ గ్లింప్స్ వీడియోతోనే అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. నెవర్ బిఫోర్ అవతారంలో విజయ్ దేవరకొండ కనిపించడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. రవి కిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని 2026 డిసెంబర్‌లో రిలీజ్ చేయనున్నారు.
దీంతో బాక్సాఫీస్ దగ్గర క్లాష్ ఆఫ్ టైటాన్స్ ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి పోటీకి వస్తే ఏ హీరో సినిమా సత్తా చాటుతుందో తెలియాలంటే వచ్చే ఏడాది డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే.
