ది బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, అవర్ పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి – విజయ్ దేవరకొండ

ది బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, అవర్ పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి – విజయ్ దేవరకొండ

Published on Mar 31, 2024 11:20 PM IST

తెలుగు సినీ పరిశ్రమలో లెజెండ్ గా ఎదిగిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు తో చిరును గౌరవించడం జరిగింది. నేడు జరిగిన ఒక ఈవెంట్ లో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరియు మెగాస్టార్ చిరంజీవి లు చీఫ్ గెస్ట్ లుగా హాజరు అయ్యారు. ఈ ఈవెంట్ లో చిరును ఉద్దేశించి విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే, సినిమా మీద, తెలుగు సినిమాలో పని చేసే డైరెక్టర్లు, యాక్టర్ల మీద, తను వచ్చిన తరువాత డాన్స్ మార్చేశారు. అప్పటి వరకు ఉండే డాన్స్ ఒకలా ఉంటే, తను వచ్చాక ఇలా కూడా చేయవచ్చా అనే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ డాన్స్ లో తీసుకు వచ్చారు. సినిమా స్క్రీన్ మీద హీరోలు చేసే ఫైట్ లు ఒకలా ఉంటే, తను వచ్చినా తరువాత ఫైటింగ్ స్టైల్ మార్చేశారు. తను వచ్చిన తరువాత పెర్ఫార్మెన్స్ మార్చేశారు. తను వచ్చిన తరువాత హీరో ఫిజికాలిటీ మార్చేశారు. తనను చూసి, ఊర్ల నుండి ఎంతో మంది డైరెక్టర్లు, హీరోలు అవుదాం అని సిటిలకి వచ్చారు. ది బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, అవర్ పద్మ విభూషణ్, అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు