సూర్య కోసం విజయ్ దేవరకొండ ?

సూర్య కోసం విజయ్ దేవరకొండ ?

Published on Sep 1, 2019 11:00 PM IST

ప్రతి సినిమాకు స్టయిల్ చేంజ్ చేస్తూ ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడని హీరోల్లో ‘సూర్య’ ఒకరు. ప్రతిసారీ కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని ప్రయత్నిస్తారు సూర్య. కాగా సూర్య నటిస్తున్న తాజా సినిమా ‘బందోబస్త్’. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకుడు. తెలుగు ప్రేక్షకులకు ‘నవాబ్’, విజువల్ వండర్ ‘2.0’ చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకం పై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను సెప్టెంబర్ రెండో వారంలో గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిధిగా వస్తారని తెలుస్తోంది. గతంలో విజయ్ దేవరకొండ ‘నోటా’ సినిమా తమిళ్ వెర్షన్ ఫంక్షన్ కి సూర్య వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను భారీ రేటుకు ప్రముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్, స‌న్ నెట్‌వ‌ర్క్‌కి చెందిన ‘జెమినీ’ సొంతం చేసుకుంది. ‘బందోబస్త్’ తమిళ వెర్షన్ ‘కాప్పాన్’ పాటలు ఇటీవలే సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదలయ్యాయి. సోనీ మ్యూజిక్ సంస్థ ద్వారా ఆడియో విడుదల కానుంది. సూర్య సరసన సాయేషా సైగల్ నటిస్తున్న ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌, కీలక పాత్రలో ఆర్య నటిస్తున్నారు. బోమన్ ఇరానీ, ఆర్య, సాయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు