డెబ్యూ డైరెక్టర్ల పై చేసిన కామెంట్స్ కి క్లారిటీ ఇచ్చిన విజయ్!

డెబ్యూ డైరెక్టర్ల పై చేసిన కామెంట్స్ కి క్లారిటీ ఇచ్చిన విజయ్!

Published on Apr 1, 2024 10:29 PM IST

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ ను కూడా గట్టిగానే చేస్తున్నారు మేకర్స్. అయితే హీరో విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ లో భాగం గా డెబ్యూ డైరెక్టర్ల పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

తాజాగా తను చేసిన వ్యాఖ్యల పై క్లారిటీ ఇచ్చారు. ఎందుకు డెబ్యూ డైరెక్టర్ల తో సినిమా చేయను అన్నారో వివరించారు. కొత్త డైరెక్టర్ల ను కూడా నేను బ్లాక్ చేస్తే, కొత్త యాక్టర్లతో ఎవరు చేస్తారు.వాళ్ళకి స్పేస్ ఉంచాలి కదా, కొత్త డైరెక్టర్ల ను, ఉన్న డైరెక్టర్లను బ్లాక్ చేసుకుంటూ కూర్చుంటే, కొత్త యాక్టర్లకు అవకాశం ఎలా వస్తుంది. పెద్ద యాక్టర్లు డైరెక్టర్ల ను ఎంకరేజ్ చేయలేదు కాబట్టి, నేను చేస్తున్నాను. నేను – తరుణ్, నేను – సందీప్ సినిమాలు చేశాం. ఇప్పుడు బిగ్ డైరెక్టర్లు అవుతున్నారు. అలా కొత్త డైరెక్టర్లు, కొత్త వారితో చేస్తే, ఎక్స్ పీరియన్స్ వస్తుంది. హిట్ కొట్టిన వారితోనే చేస్తా అని అనలేదు. ఒక సినిమా చేస్తే, నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది డైరెక్టర్ గురించి. వర్క్ గురించి. అలా స్క్రిప్ట్ గురించి, మ్యూజిక్ గురించి, అతని విజన్ గురంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతేకాక ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల బడ్జెట్ కూడా స్మాల్ కాదు అని అన్నారు విజయ్. తన ను నమ్ముకొని బయ్యర్స్, ప్రొడ్యూసర్స్ ఉంటారు అని అన్నారు. విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు