తమ్ముడి “పుష్పక విమానం” ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ.!

Published on Mar 15, 2021 11:10 am IST

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా పరిచయం కాబడిన ఆనంద్ దేవరకొండ. డీసెంట్ సినిమాల్తో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మరి లేటెస్ట్ గా నటిస్తున్న కొత్త సినిమా “పుష్పక విమానం”. దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి , ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ‘‘పుష్పక విమానం” మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ‘‘సిలకా” ను ఇవాళ (సోమవారం మార్చి 15) ఉదయం 11.07 నిమిషాలకు స్టార్ హీరో విజయ్ దేవరకొండ సాదరంగా లాంచ్ చేశాడు.

‘‘సిలకా ఎగిరిపోయావా ఆసలన్ని ఇడిసేసి ఎనకా…సిలకా చిన్నబోయిందె సిట్టి గుండె పిట్ట నువ్వు లేక ‘‘ అంటూ సాగే ఈ పాటకు రామ్ మిరియాల సంగీతాన్ని అందించడంతో పాటు మరో గీత రచయిత ఆనంద్ గుర్రం తో కలిసి సాహిత్యాన్ని అందించారు. చమన్ బ్రదర్స్ అనే బ్యాండ్ పేరుతో మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ పాటలో కనిపిస్తున్నారు. వాళ్లు పాడుతూ డాన్సులు చేస్తూ పాటకు జోష్ తీసుకొచ్చారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశలో ఉన్న ‘‘పుష్పక విమానం” సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతుంది. అలాగే ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, గీత్ సైని, శాన్వి మేఘనలతో పాటుగా సునీల్, నరేష్, హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్, సుదర్శన్, శరణ్య, మీనా వాసు,షేకింగ్ శేషు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ సమర్పిస్తుండగా పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా, సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి, రచన-దర్శకత్వం: దామోదర లు అందిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :