టెర్మినేటర్ ప్రాంచైజీలో వస్తున్న మరో మూవీ టెర్మినేటర్ డార్క్ ఫేట్. అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ 1984లో మొదలుపెట్టిన ఈ సిరీస్ లో వస్తున్న ఆరవ చిత్రం టెర్మినేటర్ డార్క్ ఫేట్. మొదటి మూడు చిత్రాలలో పూర్తి స్థాయి పాత్రలలో కనిపించిన ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ మరో మారు ఈ చిత్రంలో ఫుల్ టైం రోల్ లో కనిపించనున్నారు. ఇక ఈ మూవీ ఇండియాలో నవంబర్ 1న తెలుగు, హిందీ, తమిళ భాషలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ సందడి చేశారు. అతిధిగా హాజరై ట్రైలర్ లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమంలో విజయ్ డిఫరెంట్ లుక్ లో దర్శన మిచ్చారు. స్లిమ్ ఫిట్ బ్లేజర్ ,హాట్ ధరించి ఆర్నాల్డ్ కట్ అవుట్ పక్కన జేమ్స్ బాండ్ పోజ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక విజయ్ హీరోగా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్ జరుపుకుంటుండగా, హీరో అనే చిత్రంతో పాటు, పూరి దర్శకుడిగా తెరకెక్కనున్న మరో చిత్రంలో నటించనున్నారు.


