అక్టోబర్ లో ‘మీకు మాత్రమే చెప్తా’ !

అక్టోబర్ లో ‘మీకు మాత్రమే చెప్తా’ !

Published on Sep 3, 2019 9:00 AM IST

Vijay Devarakonda

‘విజయ్ దేవరకొండ’ కేవలం తన యాక్టింగ్ అండ్ ఆటిట్యూడ్ తోనే సెన్సేషనల్ హీరోగా స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే కొత్తదనం నిండిన సినిమాలను ప్రోత్సహించేందుకు నిర్మాతగా కూడా మారబోతున్న సంగతి తెలిసిందే. కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యాంగ్ టాలెంట్ కి ప్రోత్సాహం అందించేందుకు “మీకు మాత్రమే చెప్తా ” అనే సినిమాతో విజయ దేవరకొండ తొలి అడుగు వేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాను అక్టోబర్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్ళేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

మొత్తానికి విజయ్ తన అభిరుచిని పరిచయం చేయబోతున్నాడు. పెళ్లి చూపులతో యూత్ లో బలమైన ముద్ర ను వేసుకున్న విజయ్ కి ఆ ప్రయాణంలో పడిన కష్టాలు తెలుసు. అందుకే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక ఈ సినిమాలో తరుణ్ లీడ్ రోల్ చేస్తున్నాడు . ఆ మూవీ పేరు “మీకు మాత్రమే చెప్తా ” అని డిఫరెంట్ టైటిల్ ను పెట్టారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు