‘విజయ్ దేవరకొండ’తో యంగ్ డైరెక్టర్ ?

‘విజయ్ దేవరకొండ’తో యంగ్ డైరెక్టర్ ?

Published on Sep 4, 2019 2:40 PM IST

యువతను టార్గెట్ చేసుకుని ‘హుషారు’ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించి బాక్సాఫీస్ పరంగా హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీ హర్షకోనుగంటి. ఆ సినిమా గురించి పెద్దగా హడావుడి కనిపించకపోయినా బీసీ సెంటర్ల ప్రేక్షకుల నుండి మాత్రం మంచి రెస్పాన్స్ నే తెచ్చుకుంది ఈ చిత్రం. ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లను రాబట్టి బాగానే లాభాలను గడిచింది. అందుకేనేమో శ్రీ హర్ష కోనుగంటికు బాగానే అవకాశాలు వచ్చాయి. అయితే హర్ష కోనుగంటి మాత్రం తన రెండో సినిమాని ‘విజయ్ దేవరకొండ’తో ప్లాన్ చేస్తున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి.

తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం శ్రీ హర్ష, విజయ్ దేవరకొండకి తన కథను వినిపించాడట. ఆ కథ విజయ్ కి కూడా బాగా నచ్చిందట. దాంతో విజయ్ దేవరకొండ సినిమా చెయ్యడానికి అంగీకరించాడని తెలుస్తోంది. కాకపోతే సినిమా వచ్చే ఏడాది ఉంటుందని సమాచారం. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోతో రెండో సినిమా చేసే అవకాశాన్ని అందుకోవడం.. పైగా ఓ పెద్ద బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉండటంతో శ్రీ హర్ష కోనుగంటి మొత్తానికి మంచి ఆఫర్ పట్టాడని అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. మరి మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ రెండో సినిమాతో కూడా సక్సెస్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు