విజయ్ దేవరకొండ రేర్ ఫీట్.. ఒకరు కాదు ఇద్దరు..!

విజయ్ దేవరకొండ రేర్ ఫీట్.. ఒకరు కాదు ఇద్దరు..!

Published on Jun 17, 2026 11:15 AM IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన కెరీర్‌లో ఒక రేర్ ఫీట్ సాధించి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. ఒకరు కాదు ఇద్దరు గ్లోబల్ స్టార్స్‌తో నటించే అరుదైన రికార్డు విజయ్ దేవరకొండ దక్కించుకున్నాడు.

గతంలో ‘లైగర్’ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌ను ఇండియన్ సినిమాకు పరిచయం చేస్తూ, ఆయనతో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు విజయ్. ఇక ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘రణబాలి’ చిత్రంలో మరో ఇంటర్నేషనల్ స్టార్ ఆర్నాల్డ్ వోస్లూతో కలిసి నటించే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. ‘ది మమ్మీ’ సినిమాతో గ్లోబల్ స్థాయిలో మెప్పించిన ఆర్నాల్డ్ వోస్లూని ఇప్పుడు రణబాలి చిత్రంతో ఇండియన్ సినిమాకు పరిచయం చేస్తున్నాడు.

ఇలా ఒకరు కాదు.. ఏకంగా ఇద్దరు గ్లోబల్ స్టార్స్‌తో నటించే అవకాశం దక్కించుకున్న హీరోగా విజయ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక రణబాలి సినిమాను దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజా వార్తలు