మన టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందణ్ణలు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తమ వివాహంతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు కానీ వీరి పెళ్లి ఎఫెక్ట్ మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పడింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లాంటి పాపులర్ సోషల్ మీడియాలో వీరి పెళ్లి పోస్ట్ లు రికార్డులు బ్రేక్ చేశాయి.
మొన్నామధ్యనే వీరి పెళ్లి పోస్ట్ ఏకంగా 27 మిలియన్ కి పైగా లైక్స్ తో వరల్డ్ వైడ్ రికార్డు సెట్ చేయగా ఇప్పుడు ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజాలు రొనాల్డో, మెస్సీల పేరిట ఉన్న ఓ బ్రాండెడ్ పోస్ట్ రికార్డు కూడా వీరి పెళ్లి కొలాబరేషన్ బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది. 2022 లో మెస్సి, రోనాల్డో కలిసి లూయిస్ విట్టన్ అనే పాపులర్ బ్రాండ్ తో కొలాబరేషన్ అయ్యిన పోస్ట్ కి ఇన్స్టాగ్రామ్ లో 8.1 మిలియన్ కి పైగా లైక్స్ ఉన్నాయి.
ఇలా ఓ సెలబ్రెటీలు ఇతర బ్రాండ్ తో టై అప్ అయ్యి చేసిన పోస్ట్ లలో అదే ప్రపంచ వ్యాప్తంగా రికార్డు కానీ దానిని లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ, రష్మికల మాన్యవార్ బ్రాండ్ కొలాబరేషన్ తో బ్రేక్ అయ్యింది. దీనికి ఇప్పుడు ఏకంగా 10 మిలియన్ కి పైగా లైక్స్ వచ్చాయి. దీనితో ఈ యువ జంట పెళ్లి దెబ్బతో అలాంటి దిగ్గజాల రికార్డు సైతం గల్లంతు అయ్యిందని చెప్పక తప్పదు.
