దక్షిణాదిలో విజయ్ దేవరకొండ సెన్సేషన్.!

Published on Oct 1, 2020 9:00 am IST

మన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ మొదలు పెట్టినా తన వల్లే సెపరేట్ మంచి క్రేజ్ తెచ్చుకోగలడు. అలా తాను ఎంచుకునే ప్రాజెక్టులతో మంచి అటెన్షన్ తేగలిగే ఈ యువ నటుడికి యూత్ లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. టీనేజ్ యువత అంతా ఇపుడు విజయ్ కు ఫాలోవర్సే మన దగ్గర.

ఇక అమ్మాయిల్లో అయితే విజయ్ ఒక డ్రీం బాయ్ అంతే. అలా ఇపుడు విజయ్ దేవరకొండ మన సౌత్ ఇండియాలోనే మోస్ట్ ఇన్ఫ్లూయెన్షల్ హీరోగా మారాడు. అయితే విజయ్ కు అంతే స్థాయిలో సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా భారీగా ఉంది. అలా ఇప్పుడు మన దక్షిణాదిలోనే ఒక అరుదైన రికార్డును విజయ్ తన ఖాతాలో పడేసుకున్నాడు.

ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా 9 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను టచ్ చేసి మొట్టమొదటి దక్షిణాది హీరోగా రికార్డు నెలకొల్పాడు. దీనితో విజయ్ ఫాలోయింగ్ రేంజ్ లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం విజయ్ పలు పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో నటించనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :