సుకుమార్ – విజయ్ దేవరకొండ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే!

సుకుమార్ – విజయ్ దేవరకొండ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే!

Published on May 21, 2024 12:00 AM IST

యంగ్ హీరో విజయ్ దేవరకొండ చివరిసారిగా ది ఫ్యామిలీ స్టార్ చిత్రం లో కనిపించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది. అయితే, విజయ్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ VD 12, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న స్పై థ్రిల్లర్ పై పూర్తిగా దృష్టి పెట్టాడు. 2020లో నిర్మాత కేదార్ సెలగంశెట్టి విజయ్ దేవరకొండ హీరోగా, సుకుమార్ దర్శకుడిగా ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంది. అయితే విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో, నిర్మాత యొక్క రాబోయే విడుదల, గం గం గణేశ కోసం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో ఈ చిత్రం మళ్లీ తెరపైకి వచ్చింది.

విజయ్ దేవరకొండ మరియు సుకుమార్ చిత్రం గురించి అడిగినప్పుడు, కేదార్ సెలగంశెట్టి ఈ ప్రాజెక్ట్ ఇంకా కొనసాగుతోందని మరియు సుకుమార్ పుష్ప 2 మరియు రామ్ చరణ్‌తో మరొక చిత్రం (తాత్కాలికంగా RC 17) పూర్తి చేసిన తర్వాత ప్రారంభమవుతుందని ధృవీకరించారు. ఇంతలో, విజయ్ దేవరకొండ రవికిరణ్ కోలాతో పాన్ ఇండియన్ సినిమా మరియు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్‌ని కలిగి ఉన్నాడు. ఈ చిత్రాల పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు