విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోలేదు

విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోలేదు

Published on Oct 20, 2019 9:00 PM IST

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ తర్వాతి చిత్రం ‘హీరో’. తెలుగు, తమిళంలలో రూపొందనున్న ఈ సినిమాను ఆనంద్ అన్నామలై డైరెక్ట్ చేస్తున్నారు. బైక్ రేసింగ్ స్పోర్ట్ నేపథ్యంలో ఉండనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో ఈ చిత్రం నిర్మితమవుతోంది.

చాలారోజుల క్రితమే మొదలైన ఈ సినిమా కొంత చిత్రీకరణ పూర్తిచేసుకున్న అనంతరం ఏవో కారణాల రీత్యా ఆగిపోయినట్టు వార్తలొచ్చాయి. అంతేకాదు
ఈమధ్య సినిమాపై కొత్త అప్డేట్స్ కూడా రాలేదు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.
కానీ తాజా సమాచారం మేరకు అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని తెలుస్తోంది.

నవంబర్ మొదటి వారంలో కొత్త షెడ్యూల్ మొదలవుతుందట. ఈ సినిమా కోసం విజయ్ అంతర్జాతీయ స్థాయి రోడ్ రేసింగ్ ఛాంపియన్ అయిన రజిని కృష్ణన్ వద్ద కొన్నిరోజులు శిక్షణ తీసుకున్నాడు కూడ. ఇకపోతే ఇందులో ‘పేట’ ఫేమ్ మాళవిక మోహనన్ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు