ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ

ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ

Published on Dec 5, 2018 11:10 AM IST

సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరో రేర్ ఫీట్ సాధించాడు. 2018 కి గాను అత్యధిక ఆదాయాన్ని పొందిన టాప్ 100 జాబితాలో విజయ్ చోటు సంపాదించాడు. ప్రముఖ మ్యాగ్జైన్ ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో విజయ్ 14 కోట్ల తో 72వ స్థానంలో నిలిచాడు.

ఇక ఈ జాబితాలో సౌత్ నుండి సూపర్ స్టార్ రజినీ కాంత్ (50)కోట్లతో మొదటి స్థానంలో నిలువగా పవన్ కళ్యాణ్ (31.33 కోట్లు),తమిళ హీరో విజయ్ (30.33 కోట్లు), ఎన్టీఆర్ (28 కోట్లు),విక్రమ్ (26 కోట్లు),మహేష్ బాబు (24.33), సూర్య (23.67 కోట్లు), విజయ్ సేతుపతి (23.67 కోట్లు) , నాగార్జున (22.25కోట్లు), కొరటాల శివ (20కోట్లు) , ధనుష్ (17. 25 కోట్లు) , నయన తార (15.17కోట్లు), అల్లు అర్జున్ (15కోట్లు) , రామ్ చరణ్ (14కోట్లు) ఈ జాబితాలో చోటు సంపాదించారు.

ఓవరాల్ గా 100 మంది జాబితాలో సల్మాన్ ఖాన్ (253.25)కోట్లతో అగ్ర స్థానంలో నిలువగా విరాట్ కోహ్లీ (228.09), అక్షయ్ కుమార్ (185)కోట్లతో రెండు ,మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు