తమ సొంతూరిపై ఎవరికైనా మమకారం ఉంటుంది. ఊరికి, అక్కడ ప్రజలకు ఏదైనా మేలు చేయాలని సేవ చేయాలని చాలామంది కోరుకుంటారు. ఇందులో బాగంగానే హీరో విజయ్ దేవరకొండ సొంతూరిపై ఉన్న మమకారాన్ని చేతల్లో చూపించారు. ఆ మధ్య విజయ్, తన సతీమణి రష్మికతో కలిసి తన స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటలో ఇంటిలోకి గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ప్రతిభ గల విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తానని అప్పుడు మాట ఇచ్చాడు.
కాగా ఆ హామీని విజయ్ తాజాగా నెరవేర్చారు. ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో అచ్చంపేట డివిజన్లోని విద్యార్థుల ‘మెరిట్ స్కాలర్షిప్ అవార్డీస్’ జాబితాను రిలీజ చేశారు. విజయ్ స్వగ్రామంలోని జడ్పీహెచ్ఎస్ తుమ్మన్‌పేట పాఠశాల నుంచి 9వ తరగతిలో బి. హేమలత (1వ ర్యాంక్), పి. ప్రణీత (2వ ర్యాంక్) ఎంపికయ్యారు. అలాగే 10వ తరగతిలో కె. గణేష్ (1వ ర్యాంక్), బి. అనిల్ (2వ ర్యాంక్) ఈ స్కాలర్షిప్ సాధించారు. మొత్తానికి 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి ఈ ఉపకారవేతనాలు విజయ్ అందజేస్తున్నారు.
We are on our way to Thummanpet.
The little village where my Father was born.In February – @iamRashmika and I had announced the beginning of a little dream of ours.
To reward all the hardworking students of 9th and 10th grade from Achampet Mandal of Telangana.
Here is a… pic.twitter.com/wLNSr4ZZHe
— Vijay Deverakonda (@TheDeverakonda) June 14, 2026
