విజయ్ దేవరకొండలో స్పీడ్ తగ్గిందేమిటి !

విజయ్ దేవరకొండలో స్పీడ్ తగ్గిందేమిటి !

Published on Oct 25, 2019 1:01 AM IST

Vijay Devarakonda

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కింగ్ ఆఫ్ ది హిల్ పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పి మొదటి చిత్రంగా ‘మీకు మాత్రమే చెప్తా’ను నిర్మించారు. ఇందులో దర్శకుడు తరుణ్ భాస్కర్ మెయిన్ లీడ్. చిత్రం నవంబర్ 1న విడుదలకానుంది. అంటే ఇంకో వారం మాత్రమే టైమ్ ఉంది. కానీ సినిమా ప్రచారం ఇంకా పూర్తిస్థాయిలో మొదలుకాలేదు.

అసలు దేవరకొండ అంటేనే పబ్లిసిటీకి ఇంకో అర్థమని, సినిమాల్ని అతనిలా మరెవరూ జనాల్లోకి తీసుకెళ్లలేరు అనే పేరుంది. తను నటించిన సినిమా వస్తుదంటే విజయ్ హడావుడి వేరే లెవల్లో ఉంటుంది.
అలాంటిది దేవరకొండ తన మొదటి ప్రొడక్షన్ వెంచర్ విషయంలో ఇంత నెమ్మదిగా ఉండటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎలాగూ సినిమా టీజర్, ట్రైలర్ రెండూ బాగున్నాయనే పేరు తెచ్చుకున్నాయి, సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. సరిగ్గా ప్రమోట్ చేస్తే సినిమా జనాలకు ఈజీగానే రీచ్ అవుతుంది.

మరి ఇప్పటికైనా విజయ్ అండ్ టీమ్ ఏదో ఒకటి కొత్తగా ఆలోచించి సినిమాను ప్రమోట్ చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. నూతన దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్ కీలక పాత్రలు చేస్తున్నారు.

తాజా వార్తలు