‘హిట్ కాంబినేషన్’లో స్క్రిప్ట్ ఫైనల్ అయిందట !

Published on Sep 9, 2019 12:53 pm IST

విజయ్ దేవరకొండ – నాగ అశ్విన్ కాంబినేషన్ లో ఇంతకుముందు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మరియు ‘మహానటి’ సినిమాలు వచ్చిన సంగతి తెలిసింది. కాగా వినూత్న సినిమాగా వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ విజయ్ దేవరకొండ సినీ కెరీర్ కి పునాది కాగా, నాగ అశ్విన్ కి మంచి పేరు తీసుకువచ్చింది. ఇక అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన ‘మహానటి’ చిత్రం తెలుగు ప్రేక్షకులతో పాటు జాతీయస్థాయిలో కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంలో కర్త కర్మ క్రియ మొత్తం నాగ అశ్వినే కావడంతో విమర్శకులు అతని దర్శకత్వ శైలికి బ్రహ్మరథం పట్టారు.

అయితే విజయ్ దేవరకొండ – నాగ అశ్విన్‌ మరోసారి కలిసి పని చేయబోతున్న సంగతి తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికే రెండుసార్లు హిట్ అందుకున్న వీరి కాంబినేషన్ మూడోసారి కూడా హిట్ అందుకుంటుందేమో చూడాలి. ఇక ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More