ఇంట్రెస్టింగ్ గా విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్

ఇంట్రెస్టింగ్ గా విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్

Published on Mar 4, 2024 9:41 PM IST

యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీ నుండి నేడు టీజర్ ని రిలీజ్ చేసారు. ఇక టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ ర్యాప్ సాంగ్ తో హీరో క్యారెక్టర్ ని బాగా ప్రెజెంట్ చేసారు.

ఫ్యామిలీ స్టార్ గా తన ఫ్యామిలీ కోసం పాటుపడే వ్యక్తిగా ఈ టీజర్ లో విజయ్ పెర్ఫార్మన్స్ బాగుంది. అలానే టీజర్ చివర్లో హీరో హీరోయిన్స్ మధ్య వచ్చిన సరదా డైలాగ్ కూడా అలరిస్తుంది. మొత్తంగా ఫ్యామిలీ స్టార్ టీజర్ అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ సొంతం చేసుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు