సినిమా హీరోలకు మనదేశంలో ఉండే గౌరవం గుర్తింపు వేరు. ఒక పాపులర్ హీరోయిని అభిమానులు మానవాతీతుడిగా ఆరాధిస్తారు. తమహీరో కోసం గొడవపడతారు. మంచి పనులు చేస్తారు. ఇక తమిళ అభిమానులకు ప్రేమే కాదు పైత్యం కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. అక్కడ ఫ్యాన్ వార్స్ సర్వ సాధారణం. ముఖ్యంగా అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. అది అటుంచితే విజయ్ అభిమానులు సీఎం విజయ్ అంటూ పోస్టర్సను ముద్రించి చెన్నై నగరంలో అంటించారు. విజయ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మాస్టర్ . ఆయన సినిమాలు సాధిస్తున్న కలెక్షన్స్ దృష్టిలో ఉంచుకుని కలెక్షన్స్ మాస్టర్ మరియు సీఎం అని అర్థం వచ్చేలా పోస్టర్స్ ప్రింట్ చేసి ప్రచారం చేసుకుంటున్నారు.
కోలీవుడ్ లో విజయ్ క్రేజ్ ఏడాదికేడాది పెరుగుతూ పోతుంది. ఆయన వరుస విజయాలు అందుకుంటూ కోలీవుడ్ టాప్ స్టార్ గా ఎదుగుతున్నారు. రజిని తరువాత అంతటి స్టార్ డమ్ విజయ్ సొంతం చేసుకుంటాడు అనిపిస్తుంది. ఈ ఏడాది బిగిల్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ మాస్టర్ చేస్తున్నారు. ఖైదీ చిత్రానికి దర్శకత్వం వహించిన లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావంతో మాస్టర్ చిత్రం పై అంచనాలు మాములుగా లేవు.


