‘శ్యామ్ సింగ రాయ్’లో గెస్ట్ రోల్ ?

Vijay Deverakonda

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా క్లైమాక్స్ లో ఓ గెస్ట్ రోల్ ఉందట. ఆ రోల్లో మరో హీరో కనిపించబోతున్నాడని.. ఆ హీరో నారా రోహిత్ అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇప్పుడు ఆ రోల్ లో విజయ్ దేవరకొండ అయితేనే బాగుంటుందని చిత్రబృందం విజయ్ను అప్రోచ్ అయిందట. విజయ్ జాతి రత్నాలు సినిమాలో గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా సెకెండ్ హాఫ్ మొత్తం ఒక పురాతనమైన కోటలోనే ఎక్కువ భాగం నడుస్తోందని.. ముఖ్యంగా నాని రోల్ కి సంబంధించిన కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాల బాగుంటాయని… అందుకే నాని ఈ సినిమా పై బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి నాని 27వ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని నవంబర్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది.

Exit mobile version