ప్రపంచ వ్యాప్తంగా రికార్డు నెంబర్ స్క్రీన్స్ లో విజయ్ ఆఖరి సినిమా విడుదల! ఎన్ని వేల స్క్రీన్ లో అంటే

Jana Nayagan

ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన ఆఖరి చిత్రమే “జన నాయగన్”. హీరోగా తన ఆఖరి సినిమా సీఎం అయ్యాక విడుదల అవుతున్న మొదటి సినిమా ఇదే కావడంతో ఇప్పుడు అంచనాలు ఆకాశాన్ని అంటాయి. దర్శకీడ్ హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదలకి అన్ని సమస్యలు క్లియర్ అయ్యి గతంలో పడిన వాయిదా సమయం కంటే ఇప్పుడు మరింత లెవెల్లో ఘనంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది.

వరల్డ్ వైడ్ గా విజయ్ చివరి సినిమా ఎన్ని స్క్రీన్స్ లో విడుదల అవుతుందో షాకింగ్ రూమర్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. వీటి ప్రకారం జన నాయగన్ అన్ని భాషల్లోనూ అలానే అన్ని ప్రాంతాల్లో కలిపి ఏకంగా 7000 నుంచి 8000 వేల స్క్రీన్స్ మేర విడుదల అవుతున్నట్టుగా తెలుస్తుంది. సుమారు ఈ చిత్రం 30 దేశాల్లో విడుదల అవుతుందట.

ఇదే ఈ మధ్య కాలంలో విజయ్ కెరీర్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఓ రికార్డు రిలీజ్ అని కూడా చెప్పవచ్చు. అంచనాలు ఆల్రెడీ పీక్స్ లో ఉన్నాయి. ఇంత రికార్డు నెంబర్ రిలీజ్ కూడా కావడంతో ఓపెనింగ్స్, ఫైనల్ రన్ వసూళ్లు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది. సో ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది తెలియాలి అంటే కొంచెం ఆగి చూడాల్సిందే.

Exit mobile version