బుక్ మై షోలో ‘జన నాయగన్’ సెన్సేషన్!

Jana Nayagan

ఇప్పుడు తమిళ సినిమా దగ్గర భారీ హైప్ సెట్ చేసుకున్న లేటెస్ట్ చిత్రమే ‘జన నాయగన్'(Jana Nayagan). ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ఇది కాగా దీని కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పుడు పలు వివాదాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అనే గ్యాప్ లో హైప్ మరింత లెవెల్లో పెరుగుతూ వస్తుంది.

మరి ఈ హైప్ తోనే బుక్ మై షోలో ఈ సినిమా రికార్డు సెట్ చేసింది. ఈ సినిమాకి ప్రస్తుతం 1 మిలియన్ ఇంట్రెస్ట్స్ నమోదు అయ్యాయి. దీనితో ఈ సినిమా ఏ లెవెల్లో హైప్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో వేచి చూడక తప్పదు. ఈ సినిమాలో మమితా బైజు కీలక పాత్రలో నటించగా బాబీ డియోల్ విలన్ గా నటించారు. అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని నిర్మాణం వహించారు.

Exit mobile version