ప్రభుదేవాతో “లైగర్” టీం..కథ ఏంటో మరి.!

Published on Mar 28, 2021 1:00 pm IST

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరొందిన సెన్సేషనల్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మన తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా సుపరిచితం. ఒక్క డాన్స్ మాస్టర్ గానే కాకుండా దర్శకునిగా నటునిగా కూడా ప్రభుదేవా తన పనులు చేసుకుంటున్నారు. మరి ఇదిలా ఉండగా సెన్సేషనల్ స్టార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండేయ్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో “లైగర్” అనే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

మరి ఈ చిత్ర దర్శకుడు పూరి అలాగే నిర్మాత ఛార్మీ కౌర్ లు ప్రభు మాస్టర్ తో కలిపి ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చెయ్యడం జరిగింది. దీనితో మరింత ఆసక్తి మొదలయ్యింది. ఈ చిత్రంలో ప్రభుదేవా చేస్తున్నారా లేక విజయ్ తో తన మార్క్ ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారా అన్న టాక్ మొదలయ్యింది. మరి దీనిపై సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ సమర్పిస్తుండగా తెలుగు, హిందీ, తమిళ్ మరియు మళయాళ కన్నడ భాషల్లో వచ్చే సెప్టెంబర్ 9న విడుదల చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :