అందుకే సినిమాలకు స్వస్తి పలుకుతున్నా – విజయ్

vijay

కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు విజయ్ సినిమాలకు దూరం కాబోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నటిస్తున్న ‘జన నాయగన్‌’ ఆయన ఆఖరి చిత్రమని చర్చ సాగిన సంగతి తెలిసిందే. కాగా ఇదే తన చివరి సినిమా అని స్వయంగా విజయ్‌ ప్రకటించారు. ‘నా కోసం ఎంతోమంది అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. ఇంతకాలం నన్ను సపోర్ట్‌ చేసిన వారి కోసం మరో 30 ఏళ్లు నేను నిలబడతా. ఈ అభిమానులకు సేవ చేయడం కోసమే నేను సినిమాలకు స్వస్తి పలుకుతున్నా’ అని విజయ్ చెప్పుకొచ్చారు.

విజయ్ ఇంకా మాట్లాడుతూ.. ‘తొలి నుంచీ నేనెన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. అభిమానులు మాత్రం నన్ను ప్రోత్సహించేవారు. 33 ఏళ్లుగా నాకు సపోర్ట్‌ చేస్తూనే ఉన్నారు. ఒక చిన్న ఇల్లు అయినా నిర్మించుకోవాలన్న ఆశతో ఇండస్ట్రీలోకి వచ్చా. కానీ, మీరు (అభిమానులు) రాజ భవనం ఇచ్చారు. ఇంతగా నన్ను ఆదరించిన వారికి ఇప్పుడు నేను సపోర్ట్‌గా ఉండాలనుకుంటున్నాను’ అని విజయ్ తెలిపారు.

Exit mobile version