విజయ్ సేతుపతి, కత్రినా ల ‘మెర్రీ క్రిస్మస్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ ?

విజయ్ సేతుపతి, కత్రినా ల ‘మెర్రీ క్రిస్మస్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Published on Feb 21, 2024 11:47 PM IST

కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ అందాల నటి కత్రినా కైఫ్ ల కలయికలో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మెర్రీ క్రిస్మస్. ఇటీవల జనవరి 12న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించే విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ మార్చి 8న ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఆడియన్స్ కు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

అయితే దీని పై అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది. హిందీ, తమిళ వర్షన్లో షూట్ చేయబడ్డ ఈ మూవీ హిందీ వర్షన్ లో సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్ మరియు టిన్ను ఆనంద్ నటించగా తమిళ వర్షన్ లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ నటించారు. టిప్స్ ఇండస్ట్రీస్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీకి ప్రీతం సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు