రైతులకోసం హీరో చేసిన మంచిపని

రైతులకోసం హీరో చేసిన మంచిపని

Published on Oct 19, 2019 2:00 AM IST

విజయ్‌ సేతుపతి హీరోగా యస్పీ జననాథన్‌ దర్శకత్వంలో ‘లాభం’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీలో విజయ్ సేతుపతి సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. ఈ మధ్య కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శృతి ఈ చిత్రంతో మళ్ళీ పునరాగమనం చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి రైతుగా , మరియు సన్యాసిగా వివిధ గెటప్స్ లో కనిపించనున్నారు. ఇప్పటికే విడువులైన ఈ మూవీలోని విజయ్ లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.

కాగా ఈ మూవీలో ఓ సన్నివేశం కోసం ఫార్మర్స్ యూనియన్ బిల్డింగ్ అవసరమైందట. ఎటూ పల్లెటూరిలో చిత్రీకరణ నేపథ్యంలో రైతులకు కూడా ఉపయోగపడుతుందనే నెపంతో విజయ్ సేతుపతి నిజమైన బిల్డింగ్ నిర్మించారట. షూటింగ్ ముగిసిన వెంటనే దానిని ఆ గ్రామ రైతులకు ఇచ్చేశారట. ఇక ఇటీవల సైరా చిత్రంలో ఓ కీలక పాత్ర చేసిన విజయ్ సేతుపతి, తలపతి విజయ్ తదుపరి చిత్రంలో విలన్ రోల్ చేయడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు