“అసలు ఏం జరిగిందంటే” ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన విజయ్ సేతుపతి

“అసలు ఏం జరిగిందంటే” ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన విజయ్ సేతుపతి

Published on Oct 6, 2019 7:30 PM IST

jarigindantey

బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో మెప్పించిన మహేంద్రన్ హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న చిత్రం “అసలు ఏం జరిగిందంటే”. శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో జి.ఎస్ ఫిల్మ్స్ బ్యానర్, నిర్మాణంలో లవ్ అండ్ సస్పెన్సు థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెర్సటైల్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి “అసలు ఏం జరిగిందంటే” ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ…. “ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మా ఆహ్వానం మేరకు “అసలు ఏం జరిగిందంటే” చిత్రం ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసినందుకు విజయ్ సేతుపతి గారికి, మా యూనిట్ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో మనల్ని ఎంటర్టైన్ చేసిన మహేంద్రన్ నా దర్శకత్వంలో తెరకెక్కిన అసలు ఏం జరిగిందంటే చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతుండడం సంతోషంగా ఉంది. వైవిధ్యమైన ఈ లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ లో శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్, హరితేజ, షఫి, ఫణి, షాని, కుమ్నన్ సేతురామన్, ప్రశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లక్షీస్ ఎన్టీఆర్ సినిమా లో ఎన్టీఆర్ గా చేసిన విజయ్ కుమార్ గారు ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. చరణ్ అర్జున్ అందించిన పాటలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. కర్ణ సినిమాటోగ్రఫీ విజువల్ బ్యూటీ తో నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా టీజర్ ను విడుదల చేస్తాం” అని అన్నారు.

తాజా వార్తలు