మహారాజ ట్రైలర్.. సస్పెన్స్‌తో రఫ్ఫాడించిన విజయ్ సేతుపతి

మహారాజ ట్రైలర్.. సస్పెన్స్‌తో రఫ్ఫాడించిన విజయ్ సేతుపతి

Published on May 30, 2024 7:26 PM IST

వర్సటైల్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. ఆయన ఓ సినిమాలో నటిస్తున్నాడంటే ఆ సినిమాలో ఖచ్చితంగా సాలిడ్ కంటెంట్ ఉంటుందని అభిమానులు భావిస్తారు. ఇక విజయ్ సేతుపతి నటించే సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ డబ్ అవుతుంటాయి. ఆయన తన కెరీర్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ 50వ చిత్రం త్వరలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. నిధిలన్ స్వామినాథన్ డైరెక్ట్ చేస్తున్న ‘మహారాజ’ సినిమాలో విజయ్ సేతుపతి హీరో పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహారాజ తన ఇంట్లో లక్ష్మీ కనిపించడం లేదని.. కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతూ పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. అయితే, లక్ష్మీ అంటే ఏమిటనేది పోలీసులు తెలుసుకోలేకపోతారు. అసలు మహారాజ దేని గురించి చెబుతున్నాడా అనేది తెలుసుకునే పనిలో పోలీసులు పడతారు. ఈ ట్రైలర్ కట్ చూస్తుంటే, ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ అని అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నట్లుగా మనకు ట్రైలర్‌లో చూపెట్టారు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి తన నటనతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ ట్రైలర్ చివర్లో బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్‌ను చూపెట్టడంతో వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతున్నాయని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి, సింగంపులి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు