అసలు నిజం ఏమిటో చెప్పిన సేతుపతి

Vijay Sethupathi
బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డుకు ఎంపికైన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ సినిమా ఆధారంగా ‘లాల్ సింగ్ ఛద్దా’ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు టామ్ హంక్స్ నటించిన పాత్రను అమీర్ ఖాన్ చేస్తున్నారు. ఇందులో ఆమిర్ ఖాన్ స్నేహితుడి పాత్ర కోసం మొదట విజయ్ సేతుపతి అనుకున్నారు. చర్చలు ముగియడం సేతుపతి సినిమాకు సైన్ చేయడం జరిగిపోయాయి.

కానీ ఈమధ్య సినిమాను నుండి సేతుపతి తప్పుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. ఆవే నిజమయ్యాయి కూడ. ఆ పాత్ర కోసం సేతుపతి స్లిమ్ లుక్ ట్రై చేయాల్సి ఉండగా ఆయన చేయలేకపోయారని, అందుకే ఆమిర్ ఖాన్ ఆయన్ను పక్కనపెట్టారని వార్తలొచ్చాయి. కానీ వీటి మీద స్పందించిన సేతుపతి ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. సినిమాకు తన బరువు అసలు సమస్యే కాదని ముందు ఇచ్చిన కమిట్మెంట్స్ మూలంగా డేట్స్ కుదరకపోవడంతోనే సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇకపోతే సేతుపతి హిందీలో పలు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కిశోర్ పాండురంగ్ దర్శకత్వంలో ‘గంధీ టాక్స్’, శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు.

Exit mobile version