‘ఎల్లమ్మ’లో మళ్ళీ మార్పు.. ఈసారి ఎవరంటే..?

Yellamma

​’బలగం’ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వేణు యెల్దండి, తన నెక్స్ట్ చిత్రాన్ని ‘ఎల్గమ్మ’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదట ఈ ప్రాజెక్ట్‌లో నాని లేదా నితిన్ వంటి అగ్ర హీరోలు నటిస్తారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో మహానటి కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో నటించడానికి ఎంతో ఆసక్తి చూపించారు. కానీ, హీరో ఎంపికలో మార్పులు జరగడం, చివరకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఈ ప్రాజెక్ట్ లోకి రావడంతో సమీకరణాలు మారిపోయాయి.

​తాజా సమాచారం ప్రకారం, దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తుండటంతో కీర్తి సురేష్ ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ లీడ్ రోల్ ప్లే చేస్తున్న పక్షంలో తాను ఈ బోర్డులోకి రావడానికి సిద్ధంగా లేనని ఆమె నిర్మాతలకు సున్నితంగా తెలియజేసినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి కీర్తి తప్పుకోవడం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు, దేవి శ్రీ ప్రసాద్ తన మొదటి సినిమా కోసం హీరోగా తనను తాను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు.

​ప్రస్తుతం ‘ఎల్లమ్మ’ బృందం హీరోయిన్ వేటలో పడింది. ఈ పాత్ర చాలా కీలకం కావడంతో సాయి పల్లవి వంటి నటనకు ప్రాధాన్యమున్న నటీమణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఏ టాప్ హీరోయిన్ కూడా ఈ సినిమాపై సంతకం చేయలేదు. దిల్‌ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ‘డ్రీమ్ ప్రాజెక్ట్’ త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. బలగం వేణు మార్క్ మేకింగ్‌తో రాబోతున్న ఈ సినిమా చివరకు ఎవరిని హీరోయిన్‌గా ఎంచుకుంటుందో వేచి చూడాలి.

Exit mobile version