మన టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి కొన్ని క్రేజీ కాంబినేషన్ లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే దర్శకుడు హరీష్ శంకర్ కలయిక కూడా ఒకటి. వీరి నుంచి వచ్చిన గబ్బర్ సింగ్ అనే సినిమా 2012 లో కమర్షియల్ సినిమాలకి ఒక సరికొత్త ట్రెండ్ ని సెట్ చేసి దుమ్ము లేపేసింది. ఇలా ఆ సినిమా తర్వాత మళ్ళీ వీరి కలయిక అనగానే భారీ హైప్ సెటప్ అయ్యింది. ఇది ఆరేళ్ళ కితం కాగా ఇప్పుడు ఎట్టకేలకి వీరి కలయికలో సినిమా విడుదలకి వచ్చింది.
అయితే ఈ సినిమా మాత్రం గబ్బర్ సింగ్ తరహాలోనే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా లేదా అనేది మొదటి ఆట పడిన తర్వాత చూడాల్సిందే. అప్పట్లో గబ్బర్ సింగ్ కి ముందు పవన్ కి సరైన హిట్స్ లేవు. అలానే తన రేంజ్ లో డే 1 కి అభిమానులు సాలిడ్ ఓపెనింగ్స్ అందించారు. కానీ గబ్బర్ సింగ్ పై దానికి ముందు వచ్చిన రేంజ్ అంచనాలు అయితే ఒకింత లేవనే చెప్పాలి. అలా వచ్చిన సినిమా సునామి అయ్యింది.
బాక్సాఫీస్ దగ్గర భారీ లాంగ్ రన్ ని చూసి 50 రోజులు దాటినా కూడా సినిమాకి బ్లాక్ లోనే టికెట్లు దొరికేవి అంటే ఆ సినిమా సెట్ చేసిన సెన్సేషన్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఉస్తాద్ కి కూడా ఇలాంటి పరిస్థితినే కనిపిస్తుంది. గబ్బర్ సింగ్ తరహాలోనే హైప్ ఉంది. డే 1 కి బుకింగ్స్ కూడా బాగున్నాయి. కానీ ఆ సినిమా రేంజ్ లో కంటెంట్ పడిందా లేదా హరీష్ శంకర్ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేసారా లేదా అనేది మాత్రం ఆగి చూడాల్సిందే. ఒకవేళ క్లిక్ అయితే మాత్రం ఈ సినిమా కూడా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
