విజయ్ సేతుపతి ఆ స్టార్ హీరో సినిమాలో నటించట్లేదు

విజయ్ సేతుపతి ఆ స్టార్ హీరో సినిమాలో నటించట్లేదు

Published on Nov 25, 2019 5:34 PM IST

vijay sethupathi

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సోలో హీరోగానే కాకుండా పెద్ద హీరోల సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ కొత్త సినిమాలో నటిస్తున్న ఆయనకు కమల్ హాసన్ యొక్క ‘ఇండియన్-2’లో కూడా నటించే ఛాన్స్ దొరికింది. కానీ డేట్స్ కుదరక ఆ సినిమాకి ఒప్పుకోలేకపోయిన ఆయన ఒక ఈవెంట్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.

దీంతో అప్పటి నుండి ‘ఇండియన్-2’లో విజయ్ సేతుపతి నెగెటివ్ రోల్ చేస్తున్నారనే వార్తలు మొదలయ్యాయి. అయితే తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో నటించట్లేదని రూఢీ అయింది. దీంతో రూమర్లకు చెక్ పడింది. ఇకపోతే విజయ్ సేతుపతి తెలుగులో ‘ఉప్పెన’ చిత్రంలో నెగెటివ్ రోల్ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో విలన్ రోల్ చేసే అవకాశం ఉందనే టాక్ కూడా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు