కొత్త సినిమాను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్న దేవరకొండ !

కొత్త సినిమాను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్న దేవరకొండ !

Published on May 17, 2018 2:40 PM IST


విజయ్ దేవరకొండ నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘టాక్సీవాలా’ జూన్ నెలలో విడుదలకానుంది. అలాగే గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ సంస్థల సంయుక్త నిర్మాణంలో ఒక సినిమాను, తమిళంలో మెహ్రీన్ ప్రిజాదతో కలిసి ‘నోటా’ సినిమాను చేస్తున్నాడు ఈ యువ హీరో.

ఇలా వరుస సినిమాలు చేతిలో ఉండగానే గతంలో అనుకుని, పలు కారణాల వలన ఆలస్యమవుతూ వస్తున్న మరొక సినిమాను కూడ మొదలుపెట్టే యోచనలో ఉన్నాడు దేవరకొండ. ఆ చిత్రాన్ని నందిని రెడ్డి డైరెక్ట్ చేయనున్నారు. ‘మహానటి’ నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. అయితే సినిమా ఎప్పుడు మొదలవుతుంది, నటీనటులెవరు వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు