ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కే మళ్ళీ ఛాన్స్ !

ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కే మళ్ళీ ఛాన్స్ !

Published on Mar 28, 2021 6:55 PM IST

Lokesh Kanagaraj
తమిళ్ స్టార్ హీరో విజయ్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయిపోతాయి. అయితే వీరి కలయికలో వచ్చిన ‘మాస్టర్’ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపినా తెలుగులో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ తమిళనాడులో అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది. పైగా తమిళంలో ఈ ఏడాది ‘మాస్టర్’ తప్ప మరో హిట్ లేదు.
.
అందుకే, విజయ్ మరోసారి ఆ దర్శకుడితో చేతులు కలపడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. తన 66వ చిత్రాన్ని తీసే బాధ్యతని లోకేష్ కనగరాజ్ కి ఇచ్చాడట. నిజానికి ‘మాస్టర్’లో హీరోయిజమ్ తప్ప కథలో దమ్ము లేదని విమర్శలు వచ్చినా.. విజయ్ ఇంకా లోకేష్ పై నమ్మకం ఉంచడం నిజంగా విశేషమే. ప్రస్తుతం కమల్ హాసన్ ‘విక్రమ్’ అనే సినిమాని లోకేష్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత లోకేష్ విజయ్ సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ లో ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు