తమన్నాతో డేటింగ్‌ పై నటుడు కామెంట్స్ వైరల్

తమన్నాతో డేటింగ్‌ పై నటుడు కామెంట్స్ వైరల్

Published on Mar 24, 2024 6:36 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా ‘MCA’‌ సినిమాలో విలన్‌గా నటించిన విజ‌య్ వ‌ర్మ‌తో కొంతకాలంగా ప్రేమ‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా విజయ్ వర్మ, తమన్నాతో డేటింగ్‌ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను తమన్నాతో డేటింగ్‌ ఎప్పుడు ప్రారంభించానో చాలామంది అడుగుతూ ఉంటారు. లస్ట్ స్టోరీస్‌-2 షూటింగ్‌లో అని అందరూ అనుకుంటున్నారు. నిజానికి తమన్నా, నేను డేటింగ్‌ ప్రారంభించింది లస్ట్ స్టోరీస్‌-2 షూటింగ్‌లో కాదు.

షూటింగ్ తర్వాత, ఆ టీమ్ తో కలిసి ర్యాప్ పార్టీ చేసుకున్నాం. ఆ రోజే తమన్నాకు నా లవ్ గురించి చెప్పాను. ఐతే, నేను తమన్నాతో చెప్పిన మాట.. మీతో నేను ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు ఆమెతో చెప్పాను. ఆ తర్వాతే నేను తమన్నాతో డేటింగ్‌ ప్రారంభించాను అని చెప్పాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు