‘గిల్లి’ హీరోగా మొదటి చాయిస్ విజయ్ కాదట

‘గిల్లి’ హీరోగా మొదటి చాయిస్ విజయ్ కాదట

Published on Apr 22, 2024 8:28 PM IST

2003లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఒక్కడు, ఆ తరువాత తమిళ్ లో ఇళయదళపతి విజయ్ హీరోగా గిల్లి టైటిల్ తో 2004లో ఇది రీమేక్ అయిన విషయం తెలిసిందే. ధరణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈమూవీలో త్రిష హీరోయిన్ గా నటించగా అక్కడ కూడా ఈమూవీ సూపర్ హిట్ కొట్టింది.

విషయం ఏమిటంటే, మొదట ఈ మూవీలో హీరోగా చియాన్ విక్రమ్ ని తీసుకోవాలని దర్శకుడు ధరణి ఆలోచన చేశారట. అయితే డేట్స్, షెడ్యూల్స్ సమస్య కారణంగా అనంతరం ఆ పాత్ర విజయ్ వద్దకు చేరిందట. ఆ విధంగా విక్రమ్ స్థానంలోకి విజయ్ వచ్చారు. ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ అయి 20 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా థియేటర్స్ రీ రిలీజ్ చేయగా దానికి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు